1దేవా, నన్ను విడిపించడానికి త్వరగా రా. యెహోవా, నాకు సహాయం చేయడానికి త్వరగా రా.
2నన్ను చంపాలని, బాధించాలని చూసేవారు సిగ్గుపడి అవమానం పాలవుతారు గాక.
3ఆహా ఆహా అని పలికేవారు సిగ్గుపడి వెనక్కి తిరిగి వెళ్తారు గాక.
4నిన్ను వెతికే వారంతా నీలో ఆనందించి సంతోషిస్తారు గాక. నీ రక్షణను ప్రేమించే వారంతా దేవునికే మహిమ కలగాలి అని ఎప్పుడూ చెప్పుకుంటారు గాక.
5నేను పేదవాణ్ణి. అక్కరలో ఉన్నవాణ్ణి. నన్ను రక్షించడానికి వేగమే రా. నాకు సహాయం నువ్వే. నా రక్షణకర్తవు నువ్వే. యెహోవా, ఆలస్యం చేయవద్దు.