Bible 2 India Mobile
[VER] : [TELUGU]     [PL]  [PB] 
 <<  Hosea 14 >> 

1ఇశ్రాయేలూ, నీ పాపం చేత నీవు కూలిపోయావు గనక నీ దేవుడైన యెహోవాా వైపు తిరుగు.

2ఒప్పుకోలు మాటలు సిద్ధపరచుకొని యెహోవాా దగ్గరకు తిరిగి రండి. మీరు చెప్పవలసినదేమిటంటే <<మా పాపాలన్నిటిని పరిహరించు. అనుగ్రహంతో స్వీకరించు. అప్పుడు మేము మా పెదాల ఫలాలను అంటే స్తుతులను అర్పిస్తాము.

3అష్షూరీయులు మమ్మల్ని రక్షించరు. మేమిక మీదట గుర్రాలెక్కి యుద్ధానికి పోము. <మీరే మాకు దేవుడు> అని మేమిక మీదట మా చేతి పనితో చెప్పము. తండ్రిలేని వారికి వాత్సల్యం నీ దగ్గరే దొరుకుతుంది.>>

4వారు నన్ను వదిలి వెళ్ళిపోయిన తరువాత నేను వారిని బాగు చేస్తాను. వారి మీదనున్న నా కోపం చల్లారింది. మనస్ఫూర్తిగా వారిని ప్రేమిస్తాను.

5చెట్టుకు మంచు ఉన్నట్లు నేనతనికి ఉంటాను. తామర పువ్వు పెరిగేలా అతడు అభివృద్ధి పొందుతాడు. లెబానోను పర్వతాల్లో దేవదారు వృక్షం వేళ్లు తన్నేలా వారు తమ వేళ్లు తన్నుతారు.

6అతని కొమ్మలు విశాలంగా పెరుగుతాయి. ఒలీవచెట్టు కు ఉండే శోభ అతనికి కలుగుతుంది. లెబానోను దేవదారు చెట్లకు ఉన్నంత సువాసన అతనికి ఉంటుంది.

7అతని నీడలో నివసించేవారు మరలివస్తారు. ధాన్యం వలే వారు తిరిగి మొలుస్తారు. ద్రాక్షచెట్టులాగా వికసిస్తారు. లెబానోను ద్రాక్షరసానికి ఉన్న కీర్తి వారికి ఉంటుంది.

8ఎఫ్రాయిము ఇలా అంటాడు << బొమ్మలతో నాకిక పనేమిటి?>> నేనే అతనికి జవాబిచ్చి ఆలకిస్తున్నాను. నేనే ఎఫ్రాయిమునుగూర్చి విచారణ చేస్తున్నాను. నేను సతత హరిత సరళ వృక్షం వంటి వాడను. నావల్లనే నీకు ఫలం కలుగుతుంది.

9ఈ సంగతులు వివేచించే జ్ఞానులెవరు? వాటిని గ్రహించి తెలుసుకునే బుద్ధిమంతులెవరు? ఎందుకంటే యెహోవాా మార్గాలు యథార్థమైనవి. నీతిమంతులు వాటిలో నడుచుకుంటారు. అయితే తిరుగుబాటు చేసేవారు తొట్రుపడతారు.


  Share Facebook  |  Share Twitter

 <<  Hosea 14 >> 


Bible2india.com
© 2010-2026
Help
Dual Panel

Laporan Masalah/Saran