Bible 2 India Mobile
[VER] : [TELUGU]     [PL]  [PB] 
 <<  Numbers 29 >> 

1ఏడో నెల మొదటి రోజు మీరు పరిశుద్ధ సమాజంగా సమావేశం కావాలి.

2ఆ రోజు మీ జీవనోపాధి కోసం ఏ పనీ చేయకూడదు. అది మీరు బాకానాదం చేసే రోజు.

3ఏ లోపం లేని ఒక కోడె, ఒక పొట్టేలు, ఒక సంవత్సరం వయసున్న ఏడు మగ గొర్రెె పిల్లలను యెహోవాాాకు ఇష్టమైన సువాసన గల దహనబలిగా అర్పించాలి.

4వాటి వాటి పద్ధతి ప్రకారం దహనబలిని, దాని నైవేద్యాన్ని, వాటి పానార్పణలు అర్పించాలి.

5వాటి నైవేద్యం నూనెతో కలిపిన గోదుమపిండి, ప్రతి కోడెతో ఆరున్నర కిలోలు, పొట్టేలుతో నాలుగున్నర కిలోలు, ఏడు గొర్రెె పిల్లలతో ఒక్కొక్క దానికి రెండుంబావు కిలోలు అర్పించాలి.

6అలాగే మీ కోసం ప్రాయశ్చిత్తం చేయడానికి పాపపరిహార బలిగా ఒక మేకపిల్లను అర్పించాలి.

7ఈ ఏడో నెల పదో రోజు మీరు పరిశుద్ధ సమాజంగా సమావేశం కావాలి. అప్పుడు మిమ్మల్ని మీరు అదుపులో పెట్టుకోవాలి, ఆహారం తీసుకోకూడదు. పనులేమీ చేయకూడదు.

8ప్రాయశ్చిత్తం కోసం పాపపరిహార బలి, నిత్యమైన దహనబలి, దాని నైవేద్యం, వాటి వాటి పానార్పణలు కాక, ఒక కోడెదూడ, ఒక పొట్టేలు, ఒక సంవత్సరం వయసున్న ఏడు మగ గొర్రెెపిల్లలను యెహోవాాాకు ఇష్టమైన సువాసనగల దహనబలిగా అర్పించాలి. వాటిలో ఏలోపమూ ఉండకూడదు.

9వాటి నైవేద్యం నూనెతో కలిపిన గోదుమపిండి, ప్రతి కోడెతో ఆరున్నర కిలోలు, పొట్టేలుతో నాలుగున్నర కిలోలు,

10ఏడు గొర్రెె పిల్లలతో ఒక్కొక్క దానికి రెండుంబావు కిలోలు అర్పించాలి.

11అలాగే మీ కోసం ప్రాయశ్చిత్తం చేయడానికి పాపపరిహార బలిగా ఒక మేకపిల్లను అర్పించాలి.

12ఆ తరవాత ఏడో నెల 15 వ రోజున మీరు పరిశుద్ధ సమాజంగా సమావేశం కావాలి. అప్పుడు మీరు జీవనోపాధి కోసం పనులేమీ చేయకూడదు. ఏడు రోజులు యెహోవాాాకు పండగ జరపాలి.

13దహనబలి, దాని నైవేద్యం, దాని పానార్పణ, కాకుండా, యెహోవాాాకు ఇష్టమైన సువాసనగల దహనబలిగా 13 కోడెలూ రెండు పొట్టేళ్ళు, ఒక సంవత్సరం వయసున్న 14 గొర్రెె పిల్లలను అర్పించాలి. వాటిలో ఏ లోపమూ ఉండకూడదు.

14నైవేద్యంగా ప్రతి కోడెతో ఆరున్నర కిలోలు, ప్రతి పొట్టేలుతో నాలుగున్నర కిలోలు

15ప్రతి గొర్రెె పిల్లతో రెండుంబావు కిలోలు నూనెతో కలిపిన గోదుమ పిండి తేవాలి.

16అలాగే పాపపరిహార బలిగా ఒక మేక పిల్లను అర్పించాలి.

17రెండో రోజు దహనబలి దాని నైవేద్యం, వాటి పానార్పణలు కాక ఏ లోపం లేని 12 కోడెలను, రెండు పొట్టేళ్ళను, ఒక సంవత్సరం వయసున్న 14 గొర్రెెపిల్లలను

18వాటి వాటి లెక్క ప్రకారం వాటి వాటి నైవేద్యం,

19పానార్పణలతోబాటు పాపపరిహార బలిగా ఒక మేకపిల్లను అర్పించాలి.

20మూడో రోజు నిత్యమైన దహనబలి దాని నైవేద్యం, దాని పానార్పణలు కాక ఏ లోపం లేని 11 కోడెలను, రెండు పొట్టేళ్లను, ఒక సంవత్సరం వయసున్న 14 గొర్రెెపిల్లలను

21వాటి వాటి లెక్క ప్రకారం వాటి నైవేద్యం, పానార్పణలను

22పాపపరిహార బలిగా ఒక మేకపిల్లను అర్పించాలి.

23నాలుగో రోజు నిత్యమైన దహనబలి దాని నైవేద్యం, పానార్పణ కాక ఏ లోపం లేని 10 కోడెలను రెండు పొట్టేళ్లను ఒక సంవత్సరం వయసున్న 14 గొర్రెెపిల్లలను వాటి వాటి లెక్క ప్రకారం

24వాటి నైవేద్యం, పానార్పణలను,

25పాప పరిహార బలిగా ఒక మేకపిల్లను అర్పించాలి.

26అయిదో రోజు నిత్యమైన దహనబలి, దాని నైవేద్యం, పానార్పణ కాక ఏ లోపం లేని తొమ్మిది కోడెలను, రెండు పొట్టేళ్లను ఒక సంవత్సరం వయసున్న 14 గొర్రెెపిల్లలను

27వాటి వాటి లెక్క ప్రకారం, వాటి నైవేద్యం, పానార్పణను,

28అలాగే పాపపరిహార బలిగా ఒక మేకపిల్లను అర్పించాలి.

29ఆరో రోజు నిత్యమైన దహనబలి, దాని నైవేద్యం, పానార్పణ కాక ఏ లోపం లేని ఎనిమిది కోడెలను, రెండు పొట్టేళ్లను ఒక సంవత్సరం వయసున్న 14 గొర్రెెపిల్లలను, వాటి వాటి లెక్క ప్రకారం,

30వాటి నైవేద్యం, పానార్పణను

31పాపపరిహార బలిగా ఒక మేక పిల్లను అర్పించాలి.

32ఏడో రోజు నిత్యమైన దహనబలి, దాని నైవేద్యం, పానార్పణ కాక ఏ లోపం లేని ఏడు కోడెలను, రెండు పొట్టేళ్లను ఒక సంవత్సరం వయసున్న 14 గొర్రెె పిల్లలను వాటి వాటి లెక్క ప్రకారం,

33వాటి వాటి నైవేద్యం, పానార్పణలను,

34పాపపరిహార బలిగా ఒక మేక పిల్లను అర్పించాలి.

35ఎనిమిదో రోజు మీకు ప్రత్యేకమైన రోజు. ఆ రోజు మీరు జీవనోపాధి కోసం ఏ పనీ చేయకూడదు.

36ఆ రోజు నిత్యమైన దహనబలి, దాని నైవేద్యం, పానార్పణ కాక మీరు యెహోవాాాకు ఇష్టమైన సువాసనగల దహనబలిగా ఏ లోపం లేని నిర్దోషమైన ఒక కోడెను ఒక పొట్టేలును ఒక సంవత్సరం వయసున్న ఏడు గొర్రెెపిల్లలను వాటి వాటి లెక్క ప్రకారం

37వాటితో వాటి వాటి నైవేద్యం, పానార్పణను

38పాపపరిహార బలిగా ఒక మేకపిల్లను అర్పించాలి.

39మీ మొక్కుబళ్ళు, మీ స్వేచ్ఛార్పణలు మీ దహనబలులు, మీ నైవేద్యాలు, మీ పానార్పణలు, మీ సమాధాన బలులు కాక వీటిని నియమిత సమయాల్లో యెహోవాాాకు అర్పించాలి.

40యెహోవాాా తనకు ఆజ్ఞాపించిన దాన్నంతా మోషే ఇశ్రాయేలీయులతో పూర్తిగా వివరించాడు.


  Share Facebook  |  Share Twitter

 <<  Numbers 29 >> 


Bible2india.com
© 2010-2025
Help
Dual Panel

Laporan Masalah/Saran