Bible 2 India Mobile
[VER] : [TELUGU]     [PL]  [PB] 
 <<  Proverbs 21 >> 

1రాజు హృదయం యెహోవాా చేతిలో కాలవల్లాగా ఉంది. ఆయన తన ఇష్ట ప్రకారం దాన్ని మళ్ళిస్తాడు.

2ఒకడు ఎన్నుకున్న మార్గం అది ఎలాటిదైనా సరే, తన దృష్టికది న్యాయం గానే కనిపిస్తుంది. హృదయాలను పరిశీలించేది యెహోవాాయే.

3బలులు అర్పించడం కంటే నీతిన్యాయాలను అనుసరించి నడచు కోవడం యెహోవాాకు ప్రీతికరం.

4అహంకారం గర్విష్టి హృదయం భక్తిహీనులు వర్ధిల్లడం పాపం.

5శ్రద్ధగలవారి ఆలోచనలు లాభాన్ని తెస్తాయి. తొందరపాటుగా పనిచేసే వాడికి నష్టమే.

6అబద్ధాలాడి ధనం సంపాదించుకోవడం మరణ సమయంలో కొన ఊపిరితో సమానం.

7భక్తిహీనులకు న్యాయం గిట్టదు. వారు చేసే దౌర్జన్యమే వారిని కొట్టుకు పోయేలా చేస్తుంది.

8దోషంతో నిండిన వాడి మార్గం వంకర మార్గం. పవిత్రులు రుజుమార్గంలో నడుచుకుంటారు.

9గయ్యాళితో భవంతిలో ఉండడం కంటే మిద్దెపై ఒక మూలన నివసించడం మేలు.

10భక్తిలేని వాడి మనస్సు అస్తమానం కీడు చేయాలని చూస్తుంటుంది. అతని పొరుగు వాడికి అతని కన్నుల్లో దయ ఎంతమాత్రం కనిపించదు.

11అపహాసకుడికి శిక్ష రావడం చూసి ఆజ్ఞానిలేని బుద్ధి తెచ్చుకుంటాడు. ఉపదేశం మూలంగా జ్ఞానం గలవాడి తెలివి పెరుగుతుంది.

12న్యాయం చేసే వాడు భక్తిహీనుల ఇల్లు ఏమైపోతున్నదో కనిపెట్టి చూస్తుంటాడు. దుర్మార్గులను ఆయన పడగొట్టి నాశనం చేస్తాడు.

13దరిద్రుల మొర వినకుండా చెవులు మూసుకునేవాడు తాను మొర్ర పెట్టే సమయంలో దేవుడు దాన్ని వినిపించుకోడు.

14చాటున ఇచ్చిన కానుక కోపాన్ని చల్లారుస్తుంది. రహస్యంగా ఇచ్చిన బహుమానం తీవ్ర కోపాన్ని సైతం శాంతింప జేస్తుంది.

15న్యాయ క్రియలు చేయడం నీతిపరుడికి సంతోషం. పాపాత్ముడికి అది భయంకరం.

16వివేకమార్గం తప్పి తిరిగేవాడు ప్రేతాత్మల గుంపులో కాపురముంటాడు.

17సుఖభోగాల్లో వాంఛ గలవాడు దరిద్రుడౌతాడు. ద్రాక్షారసం, నూనెల కోసం వెంపర్లాడే వాడికి ఐశ్వర్యం కలగదు.

18నీతిపరుని కోసం దుర్మార్గులు విడుదల వెలగా ఉంటారు. యథార్థవంతులకు ప్రతిగా విశ్వాస ఘాతకులు పరిహారంగా ఉంటారు.

19ప్రాణం విసికించే జగడగొండి దానితో కాపురం చెయ్యడం కంటే ఎడారిలో నివసించడం మేలు.

20విలువైన నిధులు, నూనె జ్ఞానుల ఇళ్ళలో ఉంటాయి. బుద్ధిహీనుడు వాటిని నిర్లక్షంగా ఖర్చు చేస్తాడు.

21నీతిగా దయగా ఉండే వాడు జీవాన్ని, నీతిని ఘనతను పొందుతాడు. అతడు సరైన నిర్ణయాలు చేస్తాడు.

22జ్ఞానవంతుడు పరాక్రమశాలుల నగరం పై దాడి చేస్తాడు. అతడు దాని భద్రమైన కోటను కూలదోస్తాడు.

23నోటిని నాలుకను కాపాడుకునేవాడు ఇబ్బందుల నుండి తనను కాపాడుకుంటాడు.

24అహంకారి, గర్విష్టి- అతనికి అపహాసకుడు అని పేరు. అలాటివాడు గర్వంతో మిడిసి పడతాడు.

25సోమరిపోతు చేతులు పనిచేయవు. వాడి కోరికలే వాడికి చావు తెచ్చిపెడతాయి.

26రోజంతా అతనిలో ఆశలు ఊరుతూనే ఉంటాయి. యథార్థంగా ప్రవర్తించేవాడు వెనుదీయకుండా ఇస్తూనే ఉంటాడు.

27దుష్టులర్పించే బలులు అసహ్యం. ఆ బలులు వారు దురాలోచనతో అర్పిస్తే అవి మరింకెంత అసహ్యమో గదా.

28అబద్ధసాక్షి నాశనమై పోతాడు. శ్రద్ధగా వినేవాడు పలికే మాటలు శాశ్వతంగా నిలిచి ఉంటాయి.

29దుర్మార్గుడు ముఖం మాడ్చుకుంటాడు. యథార్థవంతుడు తన ప్రవర్తనను జాగ్రత్తగా చూసుకుంటాడు.

30యెహోవాాకు విరోధమైన జ్ఞానంగానీ వివేచనగానీ ఆలోచనగానీ నిలవదు.

31యుద్ధదినానికి గుర్రాన్ని సిద్ధపరుస్తారు. అయితే విజయం యెహోవాాదే.


  Share Facebook  |  Share Twitter

 <<  Proverbs 21 >> 


Bible2india.com
© 2010-2025
Help
Dual Panel

Laporan Masalah/Saran