Bible 2 India Mobile
[VER] : [TELUGU]     [PL]  [PB] 
 <<  Joshua 16 >> 

1యోసేపు సంతతి వారికి వచ్చిన వంతు యెరికో దగ్గర యొర్దాను నుండి

2తూర్పున ఉన్న యెరికో నీటి ఊటలు వరకు, యెరికో నుండి బేతేలు కొండ సీమ వరకు ఉంది.

3అది బేతేలు నుండి లూజు వరకు పోయి అతారోతు అర్కీయుల సరిహద్దు వరకు సాగి కింద బేత్‌హోరోను వరకు గెజెరు వరకు పడమటివైపుగా యప్లేతీయుల సరిహద్దు వరకు వ్యాపించింది. దాని సరిహద్దు సముద్రం దగ్గర అంతం అయింది.

4అక్కడ యోసేపు కుమారులు, మనష్షే ఎఫ్రాయిం సంతతి వారు స్వాస్థ్యాన్ని పొందారు.

5ఎఫ్రాయిమీయుల సరిహద్దు, అంటే వారి వంశాల ప్రకారం వారికి ఏర్పడిన సరిహద్దు అతారోతు అద్దారు నుండి ఎగువ బేత్‌హోరోను వరకు తూర్పుగా వ్యాపించింది.

6వారి సరిహద్దు మిక్మెతాతు దగ్గర ఉన్న సముద్రం వరకు పశ్చిమోత్తరంగా వ్యాపించి ఆ సరిహద్దు తానాత్ షిలోహు వరకు తూర్పువైపుగా చుట్టు తిరిగి యానోహా వరకు తూర్పున దాని దాటి

7యానోహా నుండి అతారోతు వరకు, నారా వరకు యెరికోకు తగిలి యొర్దాను వద్ద అంతమయింది.

8తప్పూయ మొదలు ఆ సరిహద్దు కానా వాగు వరకు పశ్చిమంగా వ్యాపించింది. అది వారి వంశాల ప్రకారం ఎఫ్రాయిమీయుల గోత్ర స్వాస్థ్యం.

9ఎఫ్రాయిమీయులకు అక్కడక్కడ ఇవ్వబడిన పట్టణాలు పోతే ఆ పట్టణాలన్నీ వాటి పల్లెలు మనష్షీయుల స్వాస్థ్యంలో ఉన్నాయి.

10అయితే గెజెరులో నివసించిన కనానీయుల్ని వారు వెళ్ళగొట్ట లేదు. ఇప్పటి వరకు ఆ కనానీయులు ఎఫ్రాయిమీయుల మధ్య నివసిస్తూ వారికి దాస్యం చేస్తూ ఉన్నారు.



 <<  Joshua 16 >> 


Bible2india.com
© 2010-2025
Help
Single Panel

Laporan Masalah/Saran