Bible 2 India Mobile
[VER] : [TELUGU]     [PL]  [PB] 
 <<  Psalms 3 >> 

1యెహోవా, నాకు శత్రువులు ఎంతోమంది! చాలా మంది నా మీద దాడి చేశారు.

2దేవుని నుంచి అతనికి ఏ సహాయమూ లేదు అని ఎందరో నా గురించి అంటున్నారు. సెలా.

3కాని యెహోవా, నువ్వే నాకు డాలు, నువ్వే నాకు మహిమ, నా తల ఎత్తేవాడివి.

4నేను యెహోవాకు నా స్వరమెత్తినప్పుడు, ఆయన తన పవిత్ర పర్వతంనుండి నాకు జవాబిస్తాడు. సెలా.

5యెహోవా నాకు క్షేమం ఇచ్చాడు గనక, నేను పడుకుని, నిద్రపోయి మేల్కొన్నాను.

6అన్ని వైపులనుంచి వచ్చి నాకు విరోధంగా మొహరించిన గుంపులకు నేను భయపడను.

7యెహోవా, లేచి రా. నా దేవా, నన్ను రక్షించు. నువ్వు నా శత్రువులందరినీ దవడ ఎముక మీద కొడతావు. దుర్మార్గుల పళ్లు విరగ్గొడతావు.

8రక్షణ యెహోవా నుంచి వస్తుంది. నీ ప్రజల మీద నీ ఆశీర్వాదం ఉండు గాక. సెలా.



 <<  Psalms 3 >> 


Bible2india.com
© 2010-2026
Help
Single Panel

Laporan Masalah/Saran