Bible 2 India Mobile
[VER] : [TELUGU]     [PL]  [PB] 
 <<  Psalms 1 >> 

1దుర్మార్గుల సలహా ప్రకారం నడుచుకోనివాడు, పాపాత్ముల దారిలో నిలిచి ఉండనివాడు, అల్లరిచిల్లర మూకలతో కూర్చోని వాడు ధన్యుడు.

2అతని ఆనందం యెహోవా ధర్మశాస్త్రంలో ఉంటుంది. అతడు రేయింబవళ్ళు దాన్ని ధ్యానం చేస్తూ ఉంటాడు.

3అతడు నీటికాలువల ఒడ్డున నాటుకుని, ఆకు వాడకుండా తగిన కాలంలో ఫలించే చెట్టులాగా ఉంటాడు. అతడు ఏది చేసినా వర్ధిల్లుతాడు.

4దుర్మార్గులు అలా ఉండరు. వాళ్ళు గాలికి ఎగిరిపోయే ఊకలాగా ఉంటారు.

5కాబట్టి తీర్పులో దుర్మార్గులు నిలవరు. అలానే నీతిమంతుల సభలో పాపులు నిలబడరు.

6నీతిపరుల మార్గం యెహోవాకు ఆమోదం. దుర్మార్గుల మార్గం నాశనం.



 <<  Psalms 1 >> 


Bible2india.com
© 2010-2026
Help
Single Panel

Laporan Masalah/Saran