Bible 2 India Mobile
[VER] : [TELUGU]     [PL]  [PB] 
 <<  Ezekiel 34 >> 

1యెహోవాా నాకీ విషయం మళ్ళీ తెలియచేశాడు.

2<<నరపుత్రుడా, ఇశ్రాయేలీయుల కాపరులను గురించి ఈ విషయం చెప్పు. ఆ కాపరులతో ఇలా చెప్పు, యెహోవాా ప్రభువు తెలియజేసేది ఏమిటంటే, తమ కడుపు నింపుకునే ఇశ్రాయేలీయుల కాపరులకు శిక్ష తప్పదు. కాపరులు గొర్రెలను మేపాలి గదా!

3మీరు కొవ్విన గొర్రెలను వధించి, కొవ్వు తిని, బొచ్చును కప్పుకుంటారు. కానీ గొర్రెలను మేపరు.

4జబ్బు చేసిన వాటిని మీరు ఆదుకోలేదు. రోగంతో ఉన్న వాటిని మీరు బాగుచేయలేదు. గాయపడిన వాటికి కట్టు కట్టలేదు. తోలివేసిన వాటిని మళ్ళీ తోలుకు రాలేదు. తప్పిపోయిన వాటిని వెదకలేదు. అంతేకాక మీరు కఠినంగా క్రూరంగా వాటి మీద పెత్తనం చేశారు.

5కాబట్టి, కాపరి లేక అవి చెదరిపోయాయి. చెదరిపోయి అన్ని అడవి జంతువులకు ఆహారమయ్యాయి.

6నా గొర్రెెలు పర్వతాలన్నిటి మీదా ఎత్తైన ప్రతి కొండ మీదా తిరిగాయి. నా గొర్రెెలు ప్రపంచమంతా చెదరిపోయాయి. అయితే వాటిని ఎవరూ వెదకడం లేదు.>>

7కాబట్టి కాపరులారా, యెహోవాా మాట వినండి.

8<<కాపరులు లేకుండా నా గొర్రెెలు దోపిడీకి గురై అన్ని అడవి జంతువులకు ఆహారమయ్యాయి. కాపరులు నా గొర్రెలను వెదకలేదు. వారు తమ కడుపు మాత్రమే నింపుకుంటారు. గొర్రెలను మేపరు.>> ఇదే యెహోవాా ప్రభువు సందేశం.

9కాబట్టి కాపరులారా యెహోవాా మాట వినండి.

10<<యెహోవాా ప్రభువు తెలియజేసేది ఏమిటంటే, నా జీవం తోడు. నేను ఆ కాపరులకు విరోధినయ్యాను. నా గొర్రెలను గురించి వారి దగ్గర లెక్క అడుగుతాను. వారిక గొర్రెెలు మేపడం మాన్పిస్తాను. కాపరులు తమ కడుపు నింపుకోకుండేలా చేస్తాను. నా గొర్రెెలు వారికి తిండి కాకుండా వారి నోట్లో నుంచి వాటిని తప్పిస్తాను.>> ఇదే యెహోవాా ప్రభువు సందేశం.

11యెహోవాా ప్రభువు తెలియజేసేది ఏమిటంటే, <<నేనే స్వయంగా నా గొర్రెలను వెదకి వాటిని కనుగొంటాను.

12తమ గొర్రెెలు చెదరిపోయినప్పుడు కాపరులు వాటిని వెదకే విధంగా నేను నా గొర్రెెలను వెదకి, మబ్బులు కమ్మి చీకటి అయిన రోజున అవి ఎక్కడెక్కడ చెదరిపోయాయో అక్కడ నుంచి నేను వాటిని తప్పించి,

13ఇతర ప్రజల మధ్యనుంచి వాటిని తోడుకు వచ్చి, వాటి స్వదేశంలోకి తీసుకొస్తాను. ఇశ్రాయేలు కొండల మీద, వాగుల దగ్గర, దేశంలో నివాసాలు ఏర్పడ్డ ప్రతి స్థలంలో వాటిని మేపుతాను.

14నేను మంచి మేత ఉన్న చోట వాటిని మేపుతాను. ఇశ్రాయేలు ఎత్తయిన కొండలు వాటికి మేత స్థలంగా ఉంటాయి. అక్కడ అవి మంచి మేత ఉన్న చోట పడుకుంటాయి. ఇశ్రాయేలు కొండల మీద మంచి పచ్చిక మైదానాల్లో అవి మేస్తాయి.

15నేనే నా గొర్రెలను మేపి పడుకోబెడతాను.>> ఇదే యెహోవాా ప్రభువు సందేశం.

16<<తప్పిపోయిన వాటిని నేను వెదకుతాను. తోలివేసిన వాటిని మళ్ళీ తీసుకొస్తాను. గాయపడిన వాటికి కట్టుకడతాను. బలంలేని వాటికి బలం కలిగిస్తాను. అయితే కొవ్విన వాటినీ బలంగా ఉన్న వాటినీ నాశనం చేస్తాను. మందను న్యాయంతో కాస్తాను.

17నా మందా, మీ విషయం యెహోవాా ప్రభువును, నేను, ఇలా చెబుతున్నాను. గొర్రెెలకూ పొట్టేళ్లకూ మేకలకూ మధ్య నేను న్యాయాధికారిగా ఉంటాను.

18పచ్చిక మైదానాల్లో మంచి మేత మేయడం మీకు చాలదా? మిగిలిన దాన్ని కాళ్ళతో తొక్కాలా?

19మీరు స్వచ్ఛమైన నీళ్ళు తాగి, మిగతా నీళ్ళు కాళ్ళతో కెలికి మురికిచేయాలా? మీరు కాళ్లతో తొక్కిన దాన్ని నా గొర్రెెలు మేస్తున్నాయి. మీరు మీ కాళ్ళతో కలకలు చేసిన నీళ్ళు అవి తాగుతున్నాయి.

20కాబట్టి యెహోవాా ప్రభువు ఈ మాట చెబుతున్నాడు, నేనే స్వయంగా కొవ్విన గొర్రెెలకూ చిక్కిపోయిన గొర్రెెలకూ మధ్య భేదం చూసి తీర్పు తీరుస్తాను.

21మీరు భుజాలతో పక్కతో తోస్తూ ఉంటే, నీరసించిపోయిన వాటన్నిటినీ కొమ్ములతో పొడుస్తూ చెదరగొట్టేస్తున్నారు.

22కాబట్టి ఇకనుంచి నా మంద దోపిడీ కాకుండా వాటిని రక్షిస్తాను. గొర్రె గొర్రెకూ మధ్య తీర్పు తీరుస్తాను.

23వాటిని మేపడానికి నేను నా సేవకుడు దావీదును వాటి మీద కాపరిగా నియమిస్తాను. అతడు వాటికి కాపరిగా ఉండి వాటిని మేపుతాడు.

24నేను, యెహోవాాను, వారికి దేవుడుగా ఉంటాను. నా సేవకుడు దావీదు వారి మధ్య అధిపతిగా ఉంటాడు. ఇదే యెహోవాా ప్రభువు సందేశం.

25అవి అరణ్యంలో నిర్భయంగా నివసించేలా, అడవిలో క్షేమంగా పడుకునేలా నేను వాటితో శాంతి ఒడంబడిక చేస్తాను. దేశంలో క్రూర జంతువులు లేకుండా చేస్తాను.

26నేను వాళ్ళను దీవిస్తాను. నా పర్వతం చుట్టూ ఉన్న స్థలాలను దీవిస్తాను. సరైన కాలాల్లో వానలు కురిపిస్తాను. దీవెన జల్లులివే.

27పళ్ళ చెట్లు కాయలు కాస్తాయి. భూమి పంట ఇస్తుంది. నా గొర్రెలు వాటి ప్రాంతాల్లో క్షేమంగా ఉంటాయి. నేను వారి కాడికట్లను తెంపి వారిని బందీలుగా చేసినవారి చేతిలో నుంచి వారిని విడిపించేటప్పుడు నేను యెహోవాానని వారు తెలుసుకుంటారు.

28ఇకపై వారు ఇతర రాజ్యాలకు దోపిడీగా ఉండరు. క్రూర జంతువులు వారిని మింగివేయవు! వాళ్ళు ఎవరికీ భయపడకుండా క్షేమంగా నివసిస్తారు.

29వాళ్ళ పైరుకు ప్రశాంతంగా పెరిగే వాతావరణం కలిగిస్తాను. వాళ్ళు ఇక ఏమాత్రం దేశంలో కరువుకు గురి కారు. ఇతర రాజ్యాలు వారిని చిన్నచూపు చూడరు.

30అప్పుడు నేను వారి దేవుడు యెహోవాాననీ నేను వారికి తోడుగా ఉన్నాననీ తెలుసుకుంటారు. వాళ్ళు నా ప్రజలు. ఇశ్రాయేలీయులు. ఇదే యెహోవాా ప్రభువు సందేశం.

31మీరు నా గొర్రెెలు. నేను మేపే గొర్రెెలు. నా ప్రజలు! నేను మీ దేవుణ్ణి. ఇదే యెహోవాా ప్రభువు సందేశం. >>


  Share Facebook  |  Share Twitter

 <<  Ezekiel 34 >> 


Bible2india.com
© 2010-2024
Help
Dual Panel

Laporan Masalah/Saran