Bible 2 India Mobile
[VER] : [TELUGU]     [PL]  [PB] 
 <<  Malachi 1 >> 

1ఇశ్రాయేలీయులను గూర్చి మలాకీ ప్రవక్త ద్వారా చెప్పబడిన యెహోవాా వాక్కు.

2యెహోవాా ఈ విధంగా అంటున్నాడు, <<నేను మీ పట్ల ప్రేమ కనపరిచాను. అయితే మీరు <ఏ విషయంలో నీవు మా పట్ల ప్రేమ చూపించావు?> అంటారు. ఏశావు యాకోబుకు అన్న కదా. నేను యాకోబును ప్రేమించాను.

3ఏశావును ద్వేషించాను. అతని నివాస స్థలాలను పాడుచేసి అతని ఆస్తిని ఎడారిలో ఉన్న నక్కలపాలు చేశాను.>>

4<<మనం నాశనమై పోయాం. రండి, పాడైపోయిన మన నివాస స్థలాలు తిరిగి నిర్మించుకుందాం>> అని ఎదోమీయులు అనుకొంటారు. అయితే సైన్యాలకు అధిపతియైన యెహోవాా చెబుతున్నది ఏమిటంటే, వారు మళ్ళీ నిర్మించుకొన్నప్పటికీ నేను వాటిని క్రింద పడదోసి నాశనం చేస్తాను. వాళ్ళ దేశం భక్తిహీనుల ప్రదేశమనీ, వాళ్ళపై యెహోవాా కోపం నిత్యమూ నిలిచి ఉంటుందని ఇతర ప్రజలు అంటారు.

5కళ్ళారా దాన్ని చూసిన మీరు <<ఇశ్రాయేలు ప్రజల సరిహద్దుల అవతల కూడా యెహోవాా గొప్పవాడు>> అంటారు.

6<<కుమారుడు తన తండ్రిని గొప్ప చేస్తాడు గదా, దాసుడు తన యజమానుని ఘనపరుస్తాడు గదా. నా గొప్పదనాన్ని నిర్లక్ష్యం చేసే యాజకులారా, నేను మీకు తండ్రినైతే నాకు రావలసిన ఘనత ఏమయింది? నేను యజమానుడనైతే నాకు భయపడేవాడు ఎక్కడ ఉన్నాడు?>> అని సేనల ప్రభువైన యెహోవాా మిమ్మల్ని అడిగినప్పుడు<<నీ నామాన్ని మేము ఏ విధంగా నిర్లక్ష్యం చేశాం?>> అని మీరు అంటారు.

7మీరు నా బలిపీఠం మీద అపవిత్రమైన ఆహారం నాకు అర్పిస్తూ, <<ఏమి చేసి నిన్ను అపవిత్రపరచాం?>>అంటారు. <<యెహోవాా భోజనపు బల్లను అవమాన పరచడం వల్లనే గదా

8గుడ్డి దాన్ని బలిగా అర్పించినప్పుడు అది దోషమే కదా. కుంటి దాన్ని, జబ్బు పడిన దాన్ని అర్పించినప్పుడు అది దోషం కాదా? అలాంటి వాటిని మీ యజమానికి ఇస్తే అతడు మిమ్మల్ని స్వీకరిస్తాడా? మిమ్మల్ని కనికరిస్తాడా?>> అని సేనల ప్రభువైన యెహోవాా అడుగుతున్నాడు.

9ఇప్పుడు దయ చూపమని ఆయనను ప్రాధేయపడండి. మీరే గదా ఆయనను అవమాన పరచారు. మీరు చేసిన పనులను బట్టి మీలో ఎవరినైనా ఆయన స్వీకరిస్తాడా? అని సేనల ప్రభువైన యెహోవాా అడుగుతున్నాడు.

10<<మీరు నా బలిపీఠం మీద వ్యర్థంగా నిప్పు రాజబెట్టకుండా మీలో ఒకడు నా ఆలయం ద్వారాలు మూసివేస్తే ఎంత బాగుండేది? మీరంటే నాకు ఇష్టం లేదు, మీరు అర్పించే నైవేద్యాలను నేను స్వీకరించను>> అని సేనల ప్రభువైన యెహోవాా చెబుతున్నాడు.

11తూర్పు దిక్కు నుండి పడమర దిక్కు వరకూ ఇతర దేశాల ప్రజలలో నా పేరును అంతా గౌరవిస్తారు. అన్ని ప్రాంతాలలో నా పేరుకు ధూప నైవేద్యాలు, పవిత్రమైన అర్పణలు అర్పిస్తారు. అన్య దేశాల ప్రజలలో నా పేరును ఉన్నతంగా ఎంచుతారు. అని సేనల ప్రభువైన యెహోవాా చెబుతున్నాడు.

12మీరైతే యెహోవాా బల్ల అపవిత్రమని, దాని మీద ఉంచిన ఆహారం నీచమైనదని అనుకుంటూ దానికి అవమానం కలిగిస్తున్నారు.

13అయ్యో, ఇదంతా చేయడం వ్యర్ధమని ఆ బల్లను తిరస్కరిస్తున్నారు అని ఆయన సెలవిస్తున్నాడు. ఇది సేనల ప్రభువైన యెహోవాా వాక్కు. దోచుకున్నదానినీ, కుంటిదానినీ, జబ్బు గలదానినీ మీరు తీసుకువచ్చి బలిగా అర్పించినప్పుడు అలాంటి వాటిని నేను స్వీకరిస్తానా? అని యెహోవాా అడుగుతున్నాడు.

14నేను ఘనమైన గొప్ప రాజును. అన్య దేశాల ప్రజలలో నా పేరంటే భయం. యెహోవాాకు మొక్కుబడి చెల్లించడానికి మగ జంతువు ఉన్నప్పటికీ జబ్బు పడిన దాన్ని అర్పించే వంచకుడు శాపానికి గురి అవుతాడు.


  Share Facebook  |  Share Twitter

 <<  Malachi 1 >> 


Bible2india.com
© 2010-2024
Help
Dual Panel

Laporan Masalah/Saran